తాడిపత్రి: చుక్కలూరు క్రాస్ వద్ద పోలీసులు దాడులు, ఇద్దరు మట్కా బీటర్లు అరెస్ట్,రూ.50,910 నగదు స్వాధీనం
తాడిపత్రి మండలం చుక్కలూరు క్రాస్ వద్ద సోమవారం సాయంత్రం పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో అక్కడ మక్కా రాస్తున్న రాఘవేంద్ర, మౌలాలి అనే ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.50,910 నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మట్కా చీటీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ శివగంగాధర్ రెడ్డి కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.