సత్తుపల్లి: తల్లాడ మండల పరిధిలో 27 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్ లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయి..
ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే మట్టా రాగమయి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మండల పరిధిలోని రంగం బంజర, మల్సూర్ తండా, నూతనకల్, వెంగన్నపేట,నారాయణపురం తదితర గ్రామాలలోని 27 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి స్వయంగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు..