మైనారిటీలు అంటే కూటమి ప్రభుత్వ పెద్దలకు ఎందుకు అంత చులకన అంటూ అనంతపురం నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గానుగ మెహతాజ్ ను ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వ పెద్దలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.