భూపాలపల్లి: కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లి గ్రామానికి చెందిన ఆవుల రామయ్య అనే వ్యక్తి సోమవారం రాత్రి ఇంట్లో తన భార్యతో గొడవపడి పురుగుల మందు సేవించాడు. దీంతో వెంటనే గమనించి తొలిత జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి తదుపరి మెరుగైన చికిత్స నిమిత్తం పరకాల ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ద్వారా మంగళవారం ఉదయం 8 గంటలకు తెలిసింది మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.