కొత్తగూడెం: పట్టణంలో మేక పాల కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
కొత్తగూడెం పట్టణంలోని భజన మంత్రి రోడ్ లో ఉన్న ఫుడ్ కోర్టులో మేకపాల కేంద్రాన్ని సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేకపాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని అదేవిధంగా తక్కువ కొవ్వు ,ఎక్కువ ప్రోటీన్లు,శక్తివంతమైన ఆహారమని ఆయనకు తెలిపారు. ఈ మేకపాలతో పెరుగు, మజ్జిగ,జున్ను, చీజ్ వంటి ఉత్పత్తులు తయారు చేయొచ్చని ఆయన సూచించారు.