మంత్రాలయం: ఈ నెల 25, 26 తేదీలలో కర్నూలులో జరిగే సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి : కౌతాళం సీఐటీయూ జిల్లా నేత రామాంజనేయులు
కౌతాళం:ఈ నెల 25, 26 తేదీలలో కర్నూలులో జరిగే సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా నేత రామాంజనేయులు కోరారు. బుధవారం కౌతాళం సీఐటీయూ ఆఫీసులో మండల నాయకుడు నాగరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమాన్ని విస్మరించి, పెట్టుబడుదారుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలను పెంచిందన్నారు.