భూపాలపల్లి: నాగపూర్ నుండి విజయవాడ వరకు నిర్మించనున్న కారిడార్ నిర్మాణ భూ సేకరణ పై వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్
నాగపూర్ నుండి విజయవాడ వరకు నిర్మించనున్న కారిడార్ నిర్మాణంలో పెండింగ్‌లో ఉన్న 12 హెక్టార్ల భూ సేకరణ ప్రక్రియను సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి భూ సేకరణ ప్రక్రియపై సీఎస్ రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లు తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఐడిఓసి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణా రావు నాగపూర్–విజయవాడ కారిడార్, మహాదేవపూర్–కాళేశ్వరం జాతీయ రహదారి వెడల్పుకు అటవీశాఖ భూ కేటాయింపు పురోగతిని సమీక్షించారు. రహదారుల