ప్రొద్దుటూరు: గోవాలో 352 మంది 10 కోట్లు డబ్బులు మోసపోయిన వారికి న్యాయం చేయాలి: మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి
Proddatur, YSR | Oct 29, 2025 ప్రొద్దుటూరు నియోజవర్గం నుంచి టిడిపి నాయకులు 23 ,24 ,25 వ తేదీలలో ప్రొద్దుటూరు నుంచి గోవాకు క్యాసినో జూదం ఆడిపించేందుకు 352 మందిని తీసుకెళ్లారన్నారు అని మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పక్క ప్రణాళికతో గోవా తీసుకెళ్లి మోసపూరిత ఆట ఆడిపించి 10 కోట్లు దండుకొని వారికి ఖాళీ చేతులతో పంపించారన్నారు. మోసపోయిన వారు తమ వద్ద వచ్చి బాధపడ్డారని ఆధారాలతో కూడిన రికార్డింగ్ లు తమ వద్ద ఉన్నాయని వివరించారు. మోసపోయిన వారి గురించి ప్రజలకు, పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత ఉందని అందుకే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు