రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రామ్గులాం
రేణిగుంట చేరుకున్న మారిషస్ ప్రధాన మంత్రి తిరుమల దర్శనం, బ్రహ్మర్షి ఆశ్రమ పర్యటనలో భాగంగా మారిషస్ ప్రధాన మంత్రి నవీన్ రాంగూలం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎండోమెంట్ కమిషనర్ జవహర్ లాల్, డీఐజీ షిమోసీ బాజ్పేయి, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన తిరుపతికి బయల్దేరారు.