కొండపి: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మంత్రి స్వామి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి స్వామి పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న 925 మందికి దాదాపు రూ.7.57 కోట్ల విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు మంత్రి స్వామి మీడియాకు తెలిపారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు అడిగిన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మేలు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు మర్చిపోరాదని కోరారు.