జిల్లా వ్యాప్తంగా దీపావళి టపాసులు విక్రయిస్తున్న దుకాణాల వద్ద భద్రతను పరిశీలించిన అధికారులు
Ongole Urban, Prakasam | Oct 19, 2025
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆదివారం దీపావళి టపాసులు విక్రయిస్తున్న దుకాణాల వద్ద భద్రతను అధికారులు పరిశీలించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇచ్చిన ఆదేశాల మేరకు ముందస్తు జాగ్రత్తలతో అధికారులు దీపావళి టపాసులు విక్రయిస్తున్న దుకాణాలను పరిశీలించి ముందస్తు జాగ్రత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా సేఫ్టీ ప్రికాషన్స్ దగ్గర ఉంచుకోవాలని అంతేకాకుండా నిబంధనలతో విక్రయాలు జరపాలన్నారు. అనుమతులు లేకుండా దీపావళి మందు సామాగ్రి విక్రయిస్తే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని అధికారులు హెచ్చరించారు.