సంతనూతలపాడు: మర్రి చెట్ల పాలెం వద్ద రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సును ఢీకొన్న గ్రానైట్ లారీ, 10 మంది ప్రయాణికులకు గాయాలు
చీమకుర్తి మండలం మర్రి చెట్ల పాలెం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కనిగిరి నుండి విజయవాడ వైపుకు వెళుతున్న ఆర్టీసీ బస్సును గ్రానైట్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టిసి బస్సు డ్రైవర్ ఇరుక్కుపోవడంతో క్రేన్ సహాయంతో సహాయక చర్యలను చేపట్టారు. బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మరోవైపు గ్రానైట్ రాళ్లు రోడ్డుపై పడిపోవడంతో వాటిని తొలగిస్తున్నారు.