యాడికి మండలం పెద్దపేట గ్రామంలో వ్యవసాయ పొలాల్లోని విద్యుత్ కేబుల్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. రంగస్వామి, రమణారెడ్డి, నారాయణస్వామి, మద్దిలేటి అనే రైతుల పొలాల్లో ఉన్న విద్యుత్ కేబుల్ వైర్లను దొంగలు అపహరించారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.