పత్తికొండ: పత్తికొండ మండలం దూదేకొండ ప్రధాన రహదారిలో గుంతలు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
పత్తికొండ మండలం దూదేకొండ ప్రధాన రహదారిలో ఆర్&బీ రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బందిగా ఉంది. ఈ రహదారి వెంట కర్నూల్-గుంతకల్ కు నిత్యం బస్సులు, బైకులు, ఆటోలు ఇతర వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి. రాత్రి సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని వాహనదారులు తెలిపారు. ఇప్పటికైనా ఆర్డీబీ అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వారు సోమవారం కోరుతున్నారు.