మందలూరు గ్రామంలో : భారీ కొండచిలువ హల్ చల్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రుద్రవరం మండలం మందలూరులో రాత్రి భారీ కొండచిలువ హల్చల్ చేసింది, నివాసం ఉంటున్న ఇళ్ల మధ్య కొండచిలువ కనిపించడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గ్రామస్థులు విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది కొండచిలువను బంధించి సురక్షిత ప్రాంతంలో వదిలివేశారు.