భువనగిరి: నారాయణపూర్ నుంచి చౌటుప్పల్ వైపు వస్తున్న ఆటో డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ,
యాదాద్రి భువనగిరి జిల్లా: నారాయణపూర్ నుంచి చౌటుప్పల్ వైపు వస్తున్న ఓ ఆటో డ్రైవర్ను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం మందలించారు. ఈ సందర్భంగా తంగడపల్లి శివారులో పరిమితికి మించి చిన్నపిల్లలు మహిళలతో కిక్కిరిసి ప్రయాణిస్తున్న ఆటోను గమనించి ఆపారు. ఇలాంటి ప్రయాణంలో జరగరానిది జరిగితే ప్రాణాలు కోల్పోతారని డ్రైవర్ను హెచ్చరించారు .మరోసారి ఇలా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే చర్యలు తప్పవని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.