స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం విచ్చలవిడిగా పార్టీల నేతల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని పలు విధుల్లోని ప్రధాన కూడళ్లల్లో ప్రధాన పార్టీల బ్యానర్లు, గోడలపై పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వీటిని సంబధిత అధికారులు తొలగించాలి. కానీ ఇప్పటి వరకు తొలగించపోవడంతో స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.