కుప్పం: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ
కుప్పం మున్సిపల్ పరిధిలోని 12 వ వార్డుకు సంబంధించి, ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం కింద మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ హయాంలో పేదలను గుర్తించి, గృహ నిర్మాణానికి సంబంధించి మంజూరు పత్రాలను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 12 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రవి, రాష్ట్ర బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమగళ్, యూనిట్ ఇంచార్జ్ మణి, పార్టీ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, మరియు బూత్ ఇంచార్జీలు స్వామి, ప్రకాష్ మరియు మతీన్ తదితరులు పాల్గొన్నారు.