గాజువాక: పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను సన్మానించిన గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్
ప్రభుత్వ సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు పార్టీని బలోపేతం చేయడంలో కార్యకర్తల కృషి వెలకట్టలేనిదని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.జీవీఎంసీ 65 వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేసిన వార్డు తెదేపా కార్యకర్తలను పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు,వార్డు అధ్యక్ష,కార్యదర్శులు రట్టి వాసు,వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను సాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు తొలి అడుగు కార్యక్రమం విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.