మహదేవ్పూర్: ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న భూపాల్ పల్లి జిల్లా కలెక్టర్
జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, అటవీ భూముల కేటాయింపు, కోర్టు కేసులు పరిష్కార ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లును ఆదేశించారు. సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సిఎస్ రామకృష్ణా రావు, ఆర్ అండ్ బి కార్యదర్శి వికాస్ రాజ్ లతో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పనులు వేగవంతం చేయుటపై ముఖ్యమంత్రి పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.