నారాయణ్‌ఖేడ్: రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మరణించడంతో జగన్నాథ్ పూర్ లో తీవ్ర విషాద ఛాయలు, మిన్నంటిన రోదనలు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్ పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రాచప్ప , కాశీనాథ్ , నవనాథ్ లు ఒకేరోజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బుధవారం గ్రామంలో తీవ్ర విషాధ ఛాయలు అలుముకున్నాయి. వారి ఇళ్ల వద్దకు కుటుంబీకులు బంధువులు గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో రోదనలు మిన్నంటాయి.