యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్ర స్వాతి నక్షత్రం పదిక్షణలో మాజీమంత్రి BRS MLA తన్నీరు హరీష్ రావు
యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గురువారం ఉదయం ప్రత్యేకమైన పూజలను చేపట్టారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గిరి ప్రదక్షణలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి, స్థానిక బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.