విద్యారంగ సమస్యల పరిష్కారం, ఉపాధ్యాయుల ఆర్ధిక బకాయిలు విడుదలకై ప్రారంభమైన యుటిఎఫ్ రణభేరి యాత్ర*
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటీఎఫ్) రాష్ట్ర వ్యాప్త పిలుపుమేరకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించే యుటిఎఫ్ రణభేరి జాతా సోమవారం ఉదయం తునిలో యుటిఎఫ్ సీనియర్ నాయకులు జి సత్యనారాయణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. అన్నవరం, కత్తిపూడి , గొల్లప్రోలు, పిఠాపురం మీదుగా మధ్యాహ్నం కాకినాడ యుటిఎఫ్ హోం కు చేరుకున్నారు.ఈ సందర్భంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోక పోవడం వల్లనే తాము అధికారంలోకి వచ్చామని చెప్పుకున్న ముఖ్యమంత్రి ఏడాదిన్నర పాలన కావస్తున్నా ఉపాధ్యాయులకు సంబం