నగరి: వడమాలపేట మండలం కల్లూరుకు నిలిచిన రాకపోకలు
వడమాలపేట మండలంలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కల్లూరు సమీపంలో నక్కల కాలువ పొంగి ప్రవహిస్తోంది. రోడ్డుపైకి నీరు చేరడంతో కల్లూరు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.