కొడిమ్యాల: భారీగా కురుస్తున్న వర్షాలతో కోనాపూర్ గ్రామానికి రాకపోకలు బంద్: వాగుపై బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతున్న గ్రామస్తులు
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామం లోని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు తో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ ప్రజాప్రతినిధులు పట్టించుకోక ఇబ్బందిగా మారిందని పలువురు గ్రామస్తులు ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఆవేదన వ్యక్తంచేశారు.