ఉదయగిరి: కృష్ణంపల్లి సమీపంలో అదుపుతప్పి బోల్తాపడ్డ ఆటో నలుగురికి తీవ్ర గాయాలు, మరికొందరికి స్వల్ప గాయాలు
ఉదయగిరి మండలం, క్రిష్ణంపల్లి గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో పలువురికి గాయాలైన ఘటన గురువాం చేసుకుంది. దుత్తలూరులోని బొగ్గుబట్టీలలో పనిచేసేందుకు క్రిష్ణంపల్లి గ్రామానికి చెందిన కొందరు ఆటోలో వెళుతుండగా గేద అడ్డు రావడంతో తప్పించబోయి పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఉదయగిరి, ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు.