వెనిజులా దేశ అధ్యక్షుడు నికోలాస్ మధురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్లను అమెరికా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సీపీఐ నాయకులు ఆందోళనకు దిగారు. హిమాయత్నగర్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈటీ నర్సింహ మాట్లాడారు. వెనిజులా దేశంలో ఉన్న ఖనిజ సంపదను దోచేసే కుట్ర జరుగుతుందని నేతలు ఆరోపించారు.