మార్కాపురం: తుపాన్ ప్రభావంతో కంది పంటకు తీవ్ర నష్టం జరిగిందని తెలిపిన రైతు వెంకటరెడ్డి
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కొండేపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకటరెడ్డి ఎకరా 30 సెంట్ల పొలంలో కంది పంట వేశారు. కంది మొలక వచ్చిన కొన్ని రోజులకే తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం రావడంతో పంట మునిగిపోయింది. మూడు రోజులుగా పంట పొలంలో నీరు నిలిచి ఉండడంతో పూర్తిగా కంది మొలక కుళ్ళి రాలిపోయిందని రైతు వెంకటరెడ్డి అన్నారు. పూర్తిగా ఎకరం 30 సెంట్లు పొలాన్ని దున్నివేసి మరొక పంట వేయాల్సిందే తప్ప ఈ పంట చేతికి రాదని అన్నారు.