'అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి' శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ పట్టణ కార్యదర్శి గోపి డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. పట్టణ నడిబొడ్డున ప్రభుత్వ భూమిలో విద్యుత్ స్తంభాన్ని ఆక్రమించి యథేచ్చగా దుకాణాలను ఏర్పాటుచేసి, స్లాబ్ వేయడం జరుగుతున్నా ఎందుకు అధికారులు పట్టించుకోలేదని ప్రశ్నించారు.