సోమందేపల్లిలో శ్రీ చౌడేశ్వరి దేవి మాత ఊరేగింపు మహోత్సవం
శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లిలోని రాంబాబు కాలనీలో మంగళవారం సాయంత్రం శ్రీ చౌడేశ్వరి దేవి మాత అమ్మవారి విగ్రహం ఊరేగింపుగా తీసుకువెళ్లారు . ప్రతి సంవత్సరం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలు నిర్వహిస్తారు. డప్పులు, మేళతాళాలతో గ్రామ వీధుల్లో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. గ్రామంలోని మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారె పెట్టి పూజలు చేశారు.