ఆదోని: దేశంలో, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని : అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్
Adoni, Kurnool | Sep 15, 2025 దేశంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, అదేవిధంగా మహిళలకు భద్రత కల్పించాలని, మద్యం షాపులను అరికట్టాలని, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర నాయకురాలు నిర్మలమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సుందరయ్య భవన్లో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోజురోజుకు మహిళలపై దాడులు పెరుగుతున్నాయన్నారు.