ఆదోని మండలానికి చెందిన ఓ మహిళపై అదే గ్రామానికి మైనర్ బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడి, దాడి చేశాడని పెద్దతుంబళం పోలీసులు తెలిపారు. మైనర్ బాలుడు ద్విచక్రవాహనంపై ఆదోని వైపు వెళ్తుండగా ఓ మహిళ లిఫ్ట్ అడిగారు. ఆ మహిళను ఆదోని వైపు కాకుండా సమీపంలోని కొండలలోని పొలాల్లోకి తీసుకెళ్లి బల వంతం చేయబోగా. ఆమె కేకలు వేయడంతో మహిళపై బాలుడు పక్కన ఉన్న కట్టేతో దాడి చేశాడు. పక్కన పొలంలో ఉన్న స్థానికులు మహిళ బంధువులకు ఫోన్ ద్వారా తెలియజేయగా, బంధువులు అక్కడికి చేరుకొని మద్యం మత్తులో ఉన్న బాలుడిని పెద్ద తుంబలం స్టేషన్ కు తీసుకెళ్లారు.మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.