పాణ్యం: ఓర్వకల్లు హబ్‌కు నీటి పైప్‌లైన్ నిర్మాణం వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ సిరి
ముచ్చుమర్రి నుంచి ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌కు నీటి సరఫరా పైప్‌లైన్ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఓర్వకల్లు మండలం గుట్టపాడు వద్ద జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్‌ను పరిశీలించిన ఆమె వారితో మాట్లాడారు. ఉద్యోగ కల్పన, సిఎస్సార్ పనులపై సమీక్షించి, డ్రోన్ హబ్ అభివృద్ధి పనులను కూడా పరిశీలించారు.