మహానంది మండలంలోని గ్రామాల్లో పాముల భయం
Nandyal Urban, Nandyal | Nov 12, 2025
నంద్యాల జిల్లా మహానంది మండలంలోని గ్రామాల్లో ఎక్కడ చూసినా పాముల సంచారం అధికంగా కనిపిస్తోంది. కొండచిలువలు, నాగు పాములు, రక్త పింజరి, తదితర జాతులకు చెందిన పాముల సంచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా మహానంది మండలం శ్రీనగరం గ్రామం లోని మహానంది ఇంట్లో బుధవారం పొడవైన నాగుపాము కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. వెంటనే వారు స్నేక్ క్యాచర్ మోహన్ కు సమాచారం అందించడంతో పామును చాకచక్యంగా పట్టుకుని నల్లమల అడవిలో వదిలేశాడు.