త్రిపురారం: త్రిపురారం మండలంలో సీఎం సహాయనిది పేదలకు వరం :ఎమ్మెల్సీ కోటిరెడ్డి
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారం మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోటిరెడ్డి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 38 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్యం బారిన పడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న పేదలు అప్పుల పాలు కాకూడదు అనే ఉద్దేశంతో సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు.