నంద్యాల జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్ ను శనివారం ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు, ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్లో రికార్డులను కేసు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు, అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ బాధితులకు సత్వరమే న్యాయమందేలా చూడాలని, బీట్ వ్యవస్థ మరింత పటిష్టం చేసి మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో సిరివెళ్ల సర్కిల్ సీఐ దస్తగిరి బాబు పాల్గొన్నారు