రాయదుర్గం: జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా : పట్టణంలో ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు
పాత్రికేయులు కొత్తదనంతో వార్తలు అందించినప్పుడే పాఠకులు, వీక్షకుల ఆదరణ పొందుతుందని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు అన్నారు. రెండు రోజుల పాటు రాయదుర్గం పట్టణంలో జరిగిన జర్నలిస్టుల పునశ్చరణ తరగతులు శనివారం సాయంత్రంతో ముగిశాయి. ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విలేకరులను ఉద్దేశించి మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్, ఏపియూడబ్లూజె రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు తో కలసి శిక్షణ పొందిన పాత్రికేయులకు సర్టిఫికేట్లు అందజేశారు.