కొత్తపల్లి మండల పరిధిలోని సంగమేశ్వరం నుండి ఆత్మకూరు కి వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలకు అధికారులు అరకొర మరమ్మతులు చేయడంతో, తమకు అవస్థలు తప్పడం లేదని వాహనదారులు వాపోతున్నారు, ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన రహదారులు గుంతల మయంగా మారడంతో, ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉందన్నారు తాత్కాలిక మరమ్మత్తులు కాకుండా ఎక్కువ నిధులు వెచ్చించి తార్ రోడ్డు వేయాలని గురువారం వాహనదారులు కోరుతున్నారు