రావులపాలెంలో సీఎం సహాయ నిధిని పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రావులపాలెంలో బుధవారం జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదలకు అండగా నిలుస్తున్నారన్నారు.