పలు కేసుల్లో 33 రోజులుగా నెల్లూరు జిల్లా జైల్లో ఉండి విడుదలైన DCMS మాజీ ఛైర్మన్ వీరి చలపతిరావును YCP అధినేత జగన్ ఫోన్లో పరామర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా పార్టీని వీడే ప్రసక్తే లేదని చలపతిరావు స్పష్టం చేశారు. తిరిగి జగను CMను చేసుకునేందుకు ఎన్ని ఇబ్బందులనైనా ఎదుర్కొంటామని, న్యాయ పోరాటాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు.