శ్రీపీఠం మహాలక్ష్మి బంగారు విగ్రహానికి పీలేరులో ప్రత్యేక పూజలు
వేలూరు శ్రీపీఠం మహాలక్ష్మి అమ్మవారి బంగారు విగ్రహానికి పీలేరు పట్టణంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. హైదరాబాదులో జరగనున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి వేలూరు శ్రీపీఠం మహాలక్ష్మి అమ్మవారి బంగారు విగ్రహాన్ని అర్చక బృందం తీసుకుని హైదరాబాద్ కు బయలుదేరింది. మార్గమధ్యలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ పిఏ సత్య కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు, పీలేరు - కడప జాతీయ రహదారిలోని దినకర హోటల్ సమీపంలో కొంత సమయం అమ్మవారి బంగారు విగ్రహ వాహనాన్ని ప్రజల దర్శనార్థం ఆపారు. పట్టణానికి చెందిన సూత్రం కిరణ్ కుమార్ శర్మ, శ్రీపీఠం అర్చకులతో కలిసి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు