భూపాలపల్లి: గిరిజన సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ హాస్టల్ ను మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆకస్మిక తనిఖీ చేశారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.ఈక్రమంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా పరిశీలించారు, అనంతరం విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ప్రభుత్వ మెనూ ప్రకారం ఆహర ఇవ్వాలని,వారి సమస్యలు పరిష్కరించాలని వార్డెన్ కు తెలిపారు మాజీ ఎమ్మెల్యే గండ్ర.