కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు రామప్ప కొండపై కార్తీక మాసం ఆదివారాన్ని పురస్కరించుకొని రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివపార్వతుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. జ్వాలాతోరణం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మహిళలు స్వామి వారలకు వడి బియ్యం సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు.