కర్నూలు నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు; విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్
Nandyal Urban, Nandyal | Oct 22, 2025
నైరుతి బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ బుధవారం తెలిపారు. రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా మారుతుందన్నారు. దీని ప్రభావంతో 24 గంటల్లో నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.