తాడిపత్రి: కేతిరెడ్డి పెద్దారెడ్డి గురించి మాట్లాడడం టైం వేస్ట్ చేయడమే: తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గురించి మాట్లాడడం టైం వేస్ట్ చేయడమేనని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారన్నారు. అసలు కోటి సంతకాలు కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు తనకు అర్థం కావడం లేదన్నారు. ఏ వ్యవస్థ అయినా ప్రైవేటుపరం అయితేనే అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా విలేకరులు కేతిరెడ్డి పెద్దారెడ్డి గురించి మాట్లాడగా అతని గురించి మాట్లాడడం టైం వేస్ట్ అని కొట్టి పరేశారు.