నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచాలని MRPS ఆధ్వర్యంలో నిర్మల్ అర్బన్ తహసీల్దార్ ఆఫీస్ ముట్టడి
Nirmal, Nirmal | Sep 15, 2025 కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎమ్మార్పీఎస్ నాయకులు సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ. 4 వేల నుండి 6 వేలకు, వృద్ధులకు, బీడీ కార్మికులకు, వితంతు మహిళలకు పింఛన్లు 2 వేల నుండి 4 వేలకు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 22 నెలలు గడుస్తున్న ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు.