వరదయ్యపాలెం బస్టాండ్ సమీపంలో ఇసుక దిబ్బలో దొరికిన శిశువు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
వరదయ్యపాలెం: చికిత్స పొందుతూ శిశువు మృతి వరదయ్యపాలెం బస్టాండ్ సమీపంలోని ఇసుక దిబ్బలో సోమవారం ఉదయం ఆడ శిశువు లభ్యమైన విషయం తెలిసిందే. అక్కడే కుక్కల దాడిలో గాయపడిన ఈ శిశువును చికిత్స నిమిత్తం రుయా చిన్నపిల్లల ఆసుపత్రికి 9 తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. సత్యవేడు సీడీపీఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI మల్లికార్జున్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.