కుట్రలు చేసే వ్యక్తికి ముక్కంటి ఆలయ చైర్మన్ పదవి ఇస్తారా, జనసేన మాజీ పట్టణ ఇంచార్జ్ వినిత మండిపాటు
కుట్రలు చేసే వ్యక్తికి శ్రీకాళహస్తి గుడి ఛైర్మన్ పదవి ఇస్తారా: వినూత శ్రీకాళహస్తి గుడి ఛైర్మన్గా కొట్టే సాయి నియామకాన్ని వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్కు మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత లేఖ రాశారు. 'మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి ఛైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదు. నాపై సాయి కుట్రలు చేశాడు. ఆ ఆధారాలను హరిప్రసాద్, నాదెళ్ల మనోహర్కు అందజేశా. జనసేనలో చాలామంది కష్టపడ్డారు. వాళ్లకు పదవి ఇవ్వండి. అన్ని ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు వస్తా' అని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు.