పలమనేరు: శివాలయంలో వినాయకుడి ముందు ప్రమాణం చేసి నేను ఏ తప్పు చేయలేదన్న వైసిపి పట్టణ అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి
పలమనేరు: పట్టణంలో టిడిపి వైసిపి నాయకులు రోజురోజుకు చేస్తున్న సవాల్ మరియు ప్రతి సవాల్ రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత మదన్ వైసీపీ పట్టణ అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి పై తప్పు చేయలేదని కాణిపాకంలో ప్రమాణం చేస్తావా అంటూ సవాల్ విసిరాడు. దీనికి ప్రతిగా వైసీపీ పట్టణ అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తూ, శివాలయం నందు వినాయకుడి విగ్రహం ముందు కర్పూర హారతి పై నేను ఏ తప్పు చేయలేదు అంటూ మీరు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చి నేను నిరూపించుకునేకి సిద్ధమన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు.