మచిలీపట్నం: పట్టిసీమతో ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్నాం - కృష్ణాజిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర
పట్టిసీమ వల్లే ప్రజల తాగునీటి అవసరాలు తీర్చగలుగుతున్నామని రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా కలెక్టరేట్ లో మంగళవారం 41వ నీటిపారుదల సలహా మండలి సమావేశం కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని అధికారులతో సమీక్షించారు.